వీవీ ఆరోగ్యంపై వాస్తవ నివేదిక ఇవ్వండి 

Varavara Rao Wife And Daughter Writes Letter To Maharashtra Government - Sakshi

మహారాష్ట్ర ప్రభుత్వానికి వీవీ భార్య, కుమార్తెల లేఖ

సాక్షి, హైదరాబాద్‌: విప్లవ రచయిత వరవరరావు(వీవీ) ఆరోగ్యపరిస్థితిపై దాపరికం లేకుండా వాస్తవ నివేదికను వెంటనే తమకు అందజేయాలని ఆయన కుటుంబసభ్యులు సోమవా రం మహారాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. గత వారం రోజుల్లో ఆయన్ను తలోజా జైలు నుంచి వివిధ ఆస్పత్రులకు తరలించి కేవలం కరోనా పాజిటివ్‌ మాత్రమే వచ్చిందని తెలిపారన్నారు. నానావతి ఆస్పత్రిలో చేర్చక ముందే ఆయన తలకు కుట్లుపడ్డాయని అక్కడి వైద్యులు గుర్తించారని వీవీ భార్య హేమలత, కుమార్తెలు సహజ, అనల, పవన పేర్కొన్నారు. వీవీ తనంతట తానుగా ఏ పని చేసుకోలేని స్థితిలో ఉన్నందున సహకరించేందుకు కుటుంబసభ్యులలో ఒకరిని అనుమతించాలని కోరారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top