నేనే గెలుస్తా: వనమా  | Vanama Said That He Will Win In The Elections | Sakshi
Sakshi News home page

నేనే గెలుస్తా: వనమా 

Dec 8 2018 11:13 AM | Updated on Dec 8 2018 11:13 AM

Vanama Said That He Will Win In The Elections - Sakshi

మాట్లాడుతున్న వనమా వెంకటేశ్వరరావు

సాక్షి, కొత్తగూడెంరూరల్‌: కొత్తగూడెం నియోజకవర్గంలో తనకు ప్రజల ఆదరణ ఉందని.. తప్పకుండా గెలుస్తానని ప్రజాకూటమి అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం లక్ష్మీదేవిపల్లి మండలంలోని శ్రీరామచంద్ర ఆర్ట్స్‌ కళాశాలలో జరుగుతున్న పోలింగ్‌ సరళిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గంలో తనకు ప్రజలందరూ ఓటు రూపంలో సహకరిస్తున్నారన్నారు. తనను కొత్తగూడెం ఎమ్మెల్యేగా ప్రజలు గెలిపిస్తారన్నారు. ఆయన వెంట టీడీపీ జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారయణ, (చిన్ని), లాయర్‌ లక్కినేని సత్యనారయణ తదితరులు ఉన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement