లుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌ను తెలంగాణ కాంగ్రెస్ నాయకులు గురువారం కలిశారు.
గవర్నర్‌ను కలిసిన కాంగ్రెస్ నేతలు
Jun 15 2017 12:08 PM | Updated on Sep 19 2019 8:44 PM
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌ను తెలంగాణ కాంగ్రెస్ నాయకులు గురువారం కలిశారు. హైదరాబాద్‌లో జరిగిన భూ కుంభకోణాలకు బాధ్యులు చేస్తూ టీఆర్‌ఎస్‌ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గవర్నర్‌ను కలిసిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. హైదరాబాద్, చుట్టు పక్కల భూములు ఉమ్మడి ఏపీ కంటే.. ఎక్కువ అన్యాక్రాంతం అయ్యాయని అన్నారు. అనుమానాలు, ఆధారాలు, సీఎం పేషీ ఉద్యోగుల వివరాలు, ఇతరుల ఆధారాలను గవర్నర్‌కు సమర్పించామని తెలిపారు. మియాపూర్ భూకుంభకోణం విలువ రూ.15 వేల కోట్లు అని, మంత్రి పేషీలో , సీఎంఓ లో కబ్జా చేసిన వారికి బంధువులు ఉన్నారని తెలిపారు.
టీఆర్‌ఎస్ ఎంపీ కేశవరావు ఇబ్రహీం పట్నంలో భూములు వదులుకోవడం దేనికి సంకేతమని, ఏం మతలబు ఉందని ప్రశ్నించారు. మొదటి సమీక్ష సమావేశంలో నిజామాబాద్ ఎంపీ ఎలా కూర్చున్నారు తమకు అనుమానాలు ఉన్నాయని చెప్పారు. ఎస్‌కే సిన్హా రిపోర్ట్ ఎందుకు బయట పెట్టలేదని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలకు కూడా భూములు కట్టబెట్టారని వెల్లడించారు. కేసును సీఐడీకి అప్పగించడం హాస్యాస్పదమన్నారు. ఇంత పెద్ద స్కాం ఎప్పుడూ జరగలేదని, గవర్నర్ వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు.
Advertisement
Advertisement