'కాంగ్రెస్ కాకుండా.. ఏ పార్టీకి ఓటేసినా బీజేపీకి వేసినట్టే' | utham fires on cm kcr | Sakshi
Sakshi News home page

'కాంగ్రెస్ కాకుండా.. ఏ పార్టీకి ఓటేసినా బీజేపీకి వేసినట్టే'

Jul 8 2015 3:01 PM | Updated on Aug 14 2018 10:54 AM

'కాంగ్రెస్ కాకుండా.. ఏ పార్టీకి ఓటేసినా బీజేపీకి వేసినట్టే' - Sakshi

'కాంగ్రెస్ కాకుండా.. ఏ పార్టీకి ఓటేసినా బీజేపీకి వేసినట్టే'

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్కు కాకుండా ఏ పార్టీకి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టేనని టీపీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్కు కాకుండా ఏ పార్టీకి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టేనని టీపీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. టీపీసీసీ మైనారిటీ సెల్ చైర్మన్గా ఫక్రుద్దీన్ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీపీసీసీ ఉత్తమ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ల హామీ అమలు చేయకుండా కేసీఆర్ మోసం చేస్తున్నారని విమర్శించారు. అదే విధంగా షాదీ ముబారక్ పథకాలకు కూడా నిధులు మంజూరు చేయలేదన్నారు. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల కోసమే మైనారిటీలను బుజ్జగించే చర్యలు చేపడుతున్నారని సీఎం కేసీఆర్పై వారు మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్కు కాకుండా ఏ పార్టీకి ఓటేసినా.. బీజేపీకి వేసినట్టేనని ఉత్తమ్ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement