భువనగిరికి మధుకర్‌రెడ్డి మృతదేహం | US Techie madhukar reddy's body reaches bhuvanagiri | Sakshi
Sakshi News home page

భువనగిరికి మధుకర్‌రెడ్డి మృతదేహం

Apr 11 2017 10:43 AM | Updated on Apr 4 2019 3:25 PM

భువనగిరికి మధుకర్‌రెడ్డి మృతదేహం - Sakshi

భువనగిరికి మధుకర్‌రెడ్డి మృతదేహం

అమెరికాలో ఆత్మహత్య చేసుకున్న మధుకర్‌ రెడ్డి మృతదేహాన్ని భువనగిరికి తీసుకువచ్చారు.

హైదరాబాద్‌ : కాలిఫోర్నియా రాష్ట్రంలో టిక్కీ ప్రాంతంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తూ ఆత్మహత్య చేసుకున్న గూడూరు మధుకర్‌ రెడ్డి మృతదేహాన్ని కుటుంభసభ్యులు యాదగిరి గుట్ట మండలం భువనగిరికి తీసుకువచ్చారు. ఈ నెల 4వ తేదీన మధుకర్‌రెడ్డి అమెరికాలో బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. కుమారుడి మృతదేహాన్ని చూసి తల్లి బోరున విలపించారు. మృతుడి మృతదేహానికి బంధువులు, ఎన్‌ఆర్‌ఐలు, ​గ్రామస్తులు   నివాళులర్పించారు. అనంతరం సొంత వ్యవసాయ భూమిలో మధుకర్‌ అంత్యక్రియలు జరిగాయి.

మధుకర్‌రెడ్డి భార్య స్వాతిపై దాడి

మరోవైపు మధుకర్‌రెడ్డి భౌతికకాయాన్ని చూసేందుకు వచ్చిన అతని భార్యపై బంధువులు దాడి చేశారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. మధుకర్‌రెడ్డికి భార్య, కూతురు ఉన్నారు. దాడి నేపథ్యంలో తమకు ప్రాణ హాని ఉందని, రక్షణ కల్పించాలంటూ భువనగిరి పోలీసు స్టేషన్‌లో మధుకర్‌ భార్య స్వాతి, ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.


అమెరికాలో తెలుగు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
మమ్మీ.. నన్ను క్షమించు...

Advertisement
 
Advertisement
Advertisement