అమెరికాలో తెలుగు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య | Telugu software engineer madhureddy commits suicide in US | Sakshi
Sakshi News home page

అమెరికాలో తెలుగు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య

Apr 4 2017 5:27 PM | Updated on Apr 4 2019 3:25 PM

అమెరికాలో తెలుగు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య - Sakshi

అమెరికాలో తెలుగు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య

అమెరికాలో తల్లీకొడుకుల దారుణ హత్యల ఘటన మరవక ముందే మరో విషాదం చోటుచేసుకుంది.

నల్లగొండ: అమెరికాలో తల్లీకొడుకుల దారుణ హత్యల ఘటన మరవక ముందే మరో విషాదం చోటుచేసుకుంది. తెలంగాణకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మధురెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. సియాటెల్లో సాప్ట్‌వేర్ ఇంజినీర్గా పనిచేసున్న మధురెడ్డి స్వస్థలం నల్లగొండ జిల్లా రాళ్ల జనగామ.

మధురెడ్డికి భార్య, కుమారుడు ఉన్నారు. అయితే అతడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనే దానిపై స్పష్టత లేదు. కాగా మధురెడ్డికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులకు కానీ, వివాదాలు కానీ లేవని బంధువులు చెబుతున్నారు. మధురెడ్డి బలవన్మరణంతో అతని స్వస్థలంలో విషాదం నెలకొంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement