శ్మశానవాటికలో శవాల కలకలం | unidentified bodies in Cemetery | Sakshi
Sakshi News home page

శ్మశానవాటికలో శవాల కలకలం

Jul 8 2016 2:38 AM | Updated on Apr 3 2019 5:32 PM

శ్మశానవాటికలో శవాల కలకలం - Sakshi

శ్మశానవాటికలో శవాల కలకలం

గుర్తుతెలియని వ్యక్తులు కారులో వచ్చి రెండు మృతదేహాలను స్థానికంగా పూడ్చిపెట్టడం కలకలం లేపింది. వివరాలిలా ఉన్నాయి..

విచారణ చేపట్టిన పోలీసులు
జవహర్‌నగర్ : గుర్తుతెలియని వ్యక్తులు కారులో వచ్చి రెండు మృతదేహాలను స్థానికంగా పూడ్చిపెట్టడం కలకలం లేపింది. వివరాలిలా ఉన్నాయి.. గురువారం కారులో వచ్చిన నలుగురు రెండు శవాలను జవహర్‌నగర్‌లోని అరుంధతినగర్ శ్మశానవాటికలో పూడ్చి వెళ్లారు. ఆందోళనకు గురైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్‌ఐ వెంకన్న  శ్మశాన వాటికకు చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు.

శవాలను తీసుకువచ్చిన కారు నంబర్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. కాగా.. కీసర మండలం నాగారంలో గల మెర్సి హార్వెస్టిం గ్ మిషన్ సొసైటీ వృద్ధాశ్రమంలోని ఇద్దరు అనాథ వృద్ధులు జోసఫ్ (75), రాజు (69) బుధవారం రాత్రి చనిపోగా వృద్ధాశ్రమం వారే రెండు మృతదేహాలను తీసుకువచ్చి పూడ్చిపెట్టారని పోలీసులు తెలిపారు. ఈ విషయంపై స్థానికులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని సీఐ అశోక్‌కుమార్ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement