విద్యుదాఘాతంతో ఇద్దరి మృతి | Two killed with an electric shock | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో ఇద్దరి మృతి

Mar 23 2016 1:19 PM | Updated on Oct 16 2018 3:12 PM

మెదక్ జిల్లా కోహిర్ మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలో బుధవారం విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి చెందారు.

మెదక్ జిల్లా కోహిర్ మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలో బుధవారం విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి చెందారు. గ్రామం శివారులో ఓ వ్యక్తి పొలంలో మోటార్ చెడిపోయింది. దాన్ని బాగు చేసే క్రమంలో రాములు (30), మంగలి లక్ష్మయ్య (25) బొరుబావి నుంచి పైపులను పైకి తీస్తున్నారు. ఆ పైపులు పైనుంచి వెళుతున్న విద్యుత్ తీగలను తాకడంతో విద్యుత్ ప్రసారమై షాక్‌తో మృతి చెందారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement