ఘోర రోడ్డు ప్రమాదం

Two killed in Jagtial district road accident - Sakshi

సాక్షి, మల్యాల: జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతిచెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన జిల్లాలోని మల్యాల మండలం నూకపల్లిలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. గ్రామ శివారులోని వరద కాలువ వంతెనపై ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది.
    
జగిత్యాల నుంచి కరీంనగర్‌కు ఆపిల్‌ లోడ్‌తో వెళ్తున్న లారీ రోడ్డు పై ఉన్న భారీ గుంతను తప్పించే క్రమం‍లో.. ఎదురుగా గ్రానైట్‌ లోడుతో వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు లారీలు నుజ్జు నుజ్జు కాగా.. గ్రానైట్‌ లారీ డ్రైవర్‌తో పాటు అతని పక్కనే ఉన్న అతని తమ్ముడు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృ​తులు గుజరాత్‌ పోరుబందర్‌కు చెందిన జెముదా బాయి, కారా బాయిలుగా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను జగిత్యాల ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top