సమగ్ర దర్యాప్తు జరిపించాలి.. | Sakshi
Sakshi News home page

సమగ్ర దర్యాప్తు జరిపించాలి..

Published Fri, May 22 2015 5:38 AM

సమగ్ర దర్యాప్తు జరిపించాలి.. - Sakshi

వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి
భద్రాచలం : భద్రాచలం గోదావరి బ్రిడ్జి అప్రోచ్‌రోడ్డుపై జరిగిన బస్సు ప్రమాదంపై ప్రత్యేక కమిటీ ద్వారా సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న ఆయన హుటాహుటిన భద్రాచలం వచ్చి క్షతగాత్రులను పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు.

బస్సు ప్రమాద మృతుల కుటుంబాలతో పాటు, గాయపడిన వారికి కూడా ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలన్నారు. ఘటనాస్థలిలో లూజ్ సాయిల్ ఉందని, ఇక్కడ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆర్టీసీ అధికారులు రెండు సార్లు ఉన్నతాధికారులకు లేఖ రాసినట్లుగా చెబుతున్నారన్నారు. దీనిపై ప్రభుత్వం సకాలంలో స్పందించి ఉంటే ప్రమాదం జరిగి ఉండేది కాదన్నారు.  భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో చికిత్సలు చేయించుకుంటున్న  క్షతగాత్రులను పొంగులేటి పరామర్శించారు. ‘ఏరియూ ఆస్పతిలో చికిత్స కోసం 26 మంది వచ్చారు. వారిలో ఆరుగురిని మెరుగైన వైద్యం కోసం పంపించామని’ డాక్టర్లు చెప్పారు.

బస్సులో 42 మంది ఉన్నప్పుడు మిగతా పదిమంది ఏమయ్యూరని పొంగులేటి ప్రశ్నించారు. దీనిపై వైద్యులు, పోలీసులు, ఆర్టీసీ అధికారుల వద్ద తగిన సమాచారం లేకపోవటంతో ఎంపీ పొంగులేటి వారి వివరాలను కూడా సేకరించాలని సూచించారు. వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనేది తెలుసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందని చెప్పటంతో ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ పట్టణంలోని వివిధ ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్సలు పొందుతున్న వారి వివరాలను కూడా సేకరించారు.
 
నేనున్నా.... మృతురాలు శ్రావణి కుటుంబానికి పొంగులేటి భరోసా..
బస్సు ప్రమాద మృతుల్లో ఒకరైన బొడ్డు శ్రావణి కుటుంబాన్ని ఆదుకుంటానని ఎంపీ పొంగులేటి భరోసా ఇచ్చారు. కూసుమంచి మండలం ఈశ్వరమాధారానికి చెందిన శ్రావణి కుటుంబం దుమ్ముగూడెం మండలం సింగారానికి వలస వచ్చింది. శ్రావణి, భర్త లక్ష్మీనారాయణతో కలిసి కిరాణషాపు నిర్వహిస్తోంది. వీరితో పాటు వీరి  కుమారు శ్రావణ్, కూతురు గాయత్రి సింగారం వెళ్లేందుకని ఖమ్మంలో రామబాణం బస్సెక్కారు.

ప్రమాదంలో శ్రావణి మృతిచెందగా మిగతా ముగ్గురు గాయూలపాలయ్యూరు. వీరిలో గాయత్రి ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉంది. ఎంపీని చూసి లక్ష్మీనారాయణ భోరున విలపించాడు. ఖమ్మం తీసుకెళ్లిన తన బిడ్డ పరిస్థితి ఎలా ఉందోనని ఆందోళన చెందాడు. వెంటనే ఎంపీ ఖమ్మం ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌తో ఫోన్‌లో మాట్లాడారు. బాలిక ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని, మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.

అవసరమైతే హైదరాబాద్ తరలించాలని సూచించారు. అనంతరం మార్చురీలో ఉన్న శ్రావణి మృతదేహాన్ని పొంగులేటి సందర్శించారు. ఆ సమయంలో శ్రావణి అత్త జయమ్మ ఎంపీని చూసి కన్నీటి పర్యంతమయ్యూరు. పొంగులేటి కూడా కంటనీరు పెట్టారు. ‘మీ కుటుంబానికి నేనున్నా..ఏమి కాదని అభయమిచ్చారు.’ ఎంపీ వెంట ైవె ఎస్‌ఆర్‌సీపీ భద్రాచలం నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ తెల్లం వెంకట్రావు, నాయకులు కడియం రామాచారి, గంటా కృష్ణ ఉన్నారు.

Advertisement
Advertisement