బైక్ బోల్తా: ఇద్దరికి తీవ్రగాయాలు | Two injured as bike overturns | Sakshi
Sakshi News home page

బైక్ బోల్తా: ఇద్దరికి తీవ్రగాయాలు

Dec 5 2015 7:51 PM | Updated on Aug 25 2018 5:39 PM

ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం కోయగూడెం వద్ద శనివారం రాత్రి ఓ బైక్ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

టేకులపల్లి : ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం కోయగూడెం వద్ద శనివారం రాత్రి ఓ బైక్ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. టేకులపల్లికి చెందిన డిప్లొమా విద్యార్థి అలవాల అరుణ్, పదో తరగతి విద్యార్థి గండేపల్లి శ్యామ్ బైక్‌పై కోయగూడెం వైపు వెళుతున్నారు. రైస్‌మిల్లు వద్దకు రాగానే రోడ్డుపై గుంతల కారణంగా బైక్ అదుపుతప్పి పడిపోయింది. దీంతో అరుణ్, శ్యామ్ ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని 108 వాహనంలో కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement