బావిలోకి దూసుకెళ్లిన ఆటో: ఇద్దరి మృతి | two died in auto accident | Sakshi
Sakshi News home page

బావిలోకి దూసుకెళ్లిన ఆటో: ఇద్దరి మృతి

Sep 2 2015 8:15 PM | Updated on Aug 25 2018 6:06 PM

ప్రమాదవశాత్తు ఆటో రోడ్డు పక్కన బావిలోకి దూసుకెళ్లడంతో అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు దుర్మరణం చెందారు.

కోనరావుపేట (కరీంనగర్): ప్రమాదవశాత్తు ఆటో రోడ్డు పక్కన బావిలోకి దూసుకెళ్లడంతో అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు దుర్మరణం చెందారు. డ్రైవర్ సహా తొమ్మిది మందికి తీవ్రగాయాలయ్యాయి. వివరాలు.. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల నుంచి మల్కపేటకు వస్తున్న ఆటోలో పది మంది ప్రయాణికులు ఎక్కారు. మర్తనపేట గ్రామ సమీపంలో మూలమలుపు వద్ద ఆటో బ్రేకు ఫెయిలై, హ్యాండిల్ తిరగకపోవడంతో అదే వేగంతో రోడ్డు పక్కన ఉన్న బావిలోకి దూసుకెళ్లింది.

ఈ ప్రమాదంలో ధర్మారానికి చెందిన పిట్టల చిన్నరాములు (65) అక్కడికక్కడే చనిపోయాడు. బావిలో పడ్డ ప్రయాణికుల అరుపులు విన్న స్థానికులు బాధితులను మంచం, తాళ్ల సాయంతో పైకి తీశారు. తీవ్రంగా గాయపడ్డ ఇదే గ్రామానికి మహ్మద్ ఖతీజా (60) ను కరీంనగర్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. గాయపడిన తొమ్మిది మందిని కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement