టీవీలు, కంప్యూటర్లకు అతుక్కుపోకండి | TVs, computers don't play games | Sakshi
Sakshi News home page

టీవీలు, కంప్యూటర్లకు అతుక్కుపోకండి

May 1 2015 3:49 AM | Updated on Sep 3 2017 1:10 AM

టీవీలు, కంప్యూటర్లకు అతుక్కుపోకండి

టీవీలు, కంప్యూటర్లకు అతుక్కుపోకండి

స్కూల్ లేదు.. హోంవర్క్ గోలలేదు.. అసైన్‌మెంట్ల లొల్లిలేదు.. ఏడతిరుగుతున్నావురా...

పిల్లలూ జాగ్రత్త
మెదక్ : స్కూల్ లేదు.. హోంవర్క్ గోలలేదు.. అసైన్‌మెంట్ల లొల్లిలేదు.. ఏడతిరుగుతున్నావురా... పుస్తకాలు ముందేసుకుని చదువుకోవచ్చుగా...ఇలాంటి అరుపులు లేవు...ఈ సమ్మర్ హాలీడేస్‌లు పిల్లలకు జాలీడేసే. ఎంచక్కా టీవీలు, కంప్యూటర్లకు అతుక్కుని కూర్చుందామనుకునే పిల్లలపై పెద్ద లు లుక్కేయ్యాల్సిందే. లేకుంటే మీ పిల్లల్ని అందరూ ‘లడ్డూ’ అని పిలవాల్సి వస్తుందండి బాబు. రోజుకు మూడు నాలుగు గంటలు టీవీ, కంప్యూటర్లకు అతుక్కుపోవడం, సరైన వ్యాయా మం లేకపోడంతో...బెలూన్లలా ఉబ్బిపోతున్నారని ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరిస్తోంది. రెండు గంటల కంటే ఎ క్కువగా టీవీ చూస్తే కంటి జబ్బులు వస్తాయని వైద్యులు అంటున్నారు.
 
ఒంటికి వ్యాయామం అవసరం...
ఎలాగూ సెలవులే కదా అని అస్తమానం రిమోట్ పట్టుకుని వీడియో, ఇండోర్ గేమ్స్ ఆడటం... విసుగనిపిస్తే నెట్‌బ్రౌజింగ్ చేయడం, సినిమా సీడీలతో కాలక్షేపం మితిమీరితే ఇబ్బందే మరి. ఇరవై నాలుగ్గంటలూ కుర్చీలు, సోఫాల కు అత్తుక్కుపోయి టీవీలు, కంప్యూటర్ల ఆటలకే పరి మితం కావొద్దు. ఒంటికి కాస్త వ్యాయామం కూడా ఇవ్వాలి. ఫ్రిజ్‌నిండా వేసవి రుచులు నింపుకుని, టీవీ, కంప్యూటర్లతో ఆటలాడు తూ మధ్యమధ్యలో ఎం చక్కా చిరుతిళ్లు లాగించేస్తే ఆరోగ్యం పాడవడంతోపాటు లావెక్కిపోతారు.స్కూళ్లు తెరవగానే లావెక్కిన పిల్లలను ‘లడ్డొడా..’ అంటూ ఎగతాలిచేసే ప్రమాదం ఉంది. శరీరానికి శ్రమఇవ్వాలి. అప్పుడప్పుడు బయటకు వెళ్లి పరగెత్తాలి, నడవాలి.. ఆడుకోవాలి.

Advertisement
 
Advertisement
Advertisement