'ఓయూ విద్యార్థుల జోలికి వస్తే సమాధి కడతం' | TTDP MLA Yerrabelli Fires on Telangana CM KCR | Sakshi
Sakshi News home page

'ఓయూ విద్యార్థుల జోలికి వస్తే సమాధి కడతం'

May 25 2015 5:35 PM | Updated on Aug 10 2018 7:19 PM

'ఓయూ విద్యార్థుల జోలికి వస్తే సమాధి కడతం' - Sakshi

'ఓయూ విద్యార్థుల జోలికి వస్తే సమాధి కడతం'

ఓయూ విద్యార్థుల జోలికి వస్తే కేసీఆర్‌కు ఘోరీ కడతామని టీటీడీపీ నేత, ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు హెచ్చరించారు.

మెదక్ (సంగారెడ్డి) : ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల జోలికి వస్తే సీఎం కేసీఆర్‌కు సమాధి కడతామని టీటీడీపీ నేత, కల్వకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు హెచ్చరించారు. సోమవారం మెదక్ జిల్లా సంగారెడ్డిలో జరిగిన మినీ మహానాడులో ఎర్రబెల్లి మాట్లాడారు. విద్యార్థులపై లాఠీచార్జి చేయించినందుకు టీఆర్ఎస్ సర్కార్ వెంటనే ఓయూ విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని ఎర్రబెల్లి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు టీడీపీ నాయకులు టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement