మరో ఆర్టీసీ కార్మికుడి మృతి | TSRTC Strike: RTC Driver Died Of Heart Attack In Hyderabad | Sakshi
Sakshi News home page

మరో ఆర్టీసీ కార్మికుడి మృతి

Oct 23 2019 10:59 AM | Updated on Oct 23 2019 11:52 AM

TSRTC Strike: RTC Driver Died Of Heart Attack In Hyderabad - Sakshi

రమేష్‌ (ఫైల్‌ ఫోటో)

సాక్షి, హైదరాబాద్‌ : ఆర్టీసీలో మరో గుండె ఆగింది. ముషిరాబాద్‌ డిపోలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న రమేష్‌(37) బుధవారం గుండెపోటుతో మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్‌ గ్రామానికి చెందిన రమేష్‌ గత 17 రోజులుగా సమ్మెలో చురుగ్గా పాల్గొన్నాడు.  రెండు రోజుల గుండెనొప్పి రావడంతో మలక్‌పేటలోని యశోదా ఆస్పత్రిలో ఆడ్మిట్‌ అయ్యారు. చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూశారు. తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె 19వ రోజుకు చేరింది. ప్రభుత్వం చర్చలు జరపకపోవడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. నేడు అన్ని డిపోల వద్ద కార్మికులు ఆందోళన నిర్వహించారు. తమ సమ్మెకు మద్దతు తెలపాలని కార్మిక సంఘాల నేతలు ప్రజాప్రతినిధులను కోరనున్నారు. 

(చదవండి : గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్‌ మృతి)

Advertisement
 
Advertisement
Advertisement