పోకిరీల లెక్కతీయండి..

TS Police Decided To Give Training For SHG From Villages After Disha Incident - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : గ్రామాల్లో జులాయిగా తిరిగే పోకిరీల డేటా పోలీసుల వద్దకు చేరనుంది. అమ్మాయిలను వేధించే ఆకతాయిల జాబితా ఇకపై ప్రతీ పోలీస్‌స్టేషన్‌లో ప్రత్యేకంగా నిర్వహించనున్నారు. ‘దిశ’ఘటన దరిమిలా మహిళల భద్రత, రక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా పోకిరీల డేటా సేకరించనున్నారు. పట్టణాలతో పా టు గ్రామాల్లో పనీపాటా లేకుండా తిరిగేవారిపై పోలీసులు స్పెషల్‌ ఫోకస్‌ పెట్టనున్నారు. మహిళలపై వేధింపులకు సంబం ధించిన కేసుల్లో అధిక శాతం నిందితులు పనీపాటా లేనివారే కావడం గమనార్హం. 

ఎస్‌హెచ్‌జీలకు శిక్షణ... 
మహిళలపై లైంగిక వేధింపుల నివారణకు.. సమస్యలపై ప్రజల్లో అవగాహన పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం స్వయం సహాయక గ్రూపు(ఎస్‌హెచ్‌జీ)ల్లోని మహిళకు చట్టాలు, సైబర్‌ క్రైమ్, లైంగిక వేధింపులు, ఈవ్‌టీజింగ్, పోలీసులను ఎలా సంప్రదించాలి.. తదితర సమస్యలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. వీరు పాఠశాలలు, కాలేజీల్లో మహిళా రక్షణపై విద్యార్థులను చైతన్యం చేయనున్నారు. వీరికి షీటీమ్స్, పోలీసు కళాబృందాలు తోడవనున్నాయి. విద్యాసంస్థలే కాదు, కార్యాలయాలు, గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లోనూ ఇంటింటికి తిరిగి అవగాహన కల్పించనున్నారు. 

పాఠ్యాంశాల్లోనూ మార్పులు.. 
మహిళా భద్రత కోసం సమాజం ఆలోచ నల్లో మరింత మార్పు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. బాలికలపై వివక్షను రూపుమాపడం, లింగ సమా నత్వం సాధించడానికి స్కూలు పాఠ్యాంశాల్లో కొత్త అంశాలు చేర్చాలని నిర్ణయించారు. అమ్మాయిలను వేధిస్తే తలెత్తే పరిణామాలు, చట్టపరంగా ఎలాంటి శిక్షలు పడతాయో వివరించేలా పాఠ్యాంశాలు రూపొందించనున్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో ఈ మేరకు మార్పులు చేయాలని భావిస్తోంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top