సిద్దిపేట నుంచే టీఆర్ఎస్లో ముసలం: నాగం | trs will face no confidence from siddipet only, says nagam janardhan reddy | Sakshi
Sakshi News home page

సిద్దిపేట నుంచే టీఆర్ఎస్లో ముసలం: నాగం

Sep 5 2014 3:09 PM | Updated on Aug 15 2018 9:22 PM

సిద్దిపేట నుంచే టీఆర్ఎస్లో ముసలం: నాగం - Sakshi

సిద్దిపేట నుంచే టీఆర్ఎస్లో ముసలం: నాగం

టీఆర్ఎస్లో ముసలం సిద్దిపేట నుంచే పుడుతుందని బీజేపీ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి అన్నారు.

టీఆర్ఎస్లో ముసలం సిద్దిపేట నుంచే పుడుతుందని బీజేపీ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు హరీష్ రావు నుంచి అసమ్మతి భయం ఉంది కాబట్టే సంఖ్య పెంచుకోడానికి ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో శుక్రవారం జరిగిన టీడీపీ, బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, టీడీపీ నేత రమణ తదితరులు హాజరయ్యారు. మహబూబ్‌నగర్‌లోని కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నోటీ మునిగిపోతే పట్టించుకోని మంత్రి హరీష్‌రావు ఎన్నికల ప్రచారంలో మునిగిపోయారని నాగం జనార్ధన్ రెడ్డి విమర్శించారు. మహబూబ్‌నగర్ జిల్లా తెలంగాణలో ఉందో లేదో హరీష్‌రావు చెప్పాలని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement