తెలంగాణ రాష్ట్రం దేశానికే  ఆదర్శం | Sakshi
Sakshi News home page

తెలంగాణ రాష్ట్రం దేశానికే  ఆదర్శం

Published Wed, Jul 18 2018 11:34 AM

TRS MLA Baburao Start Development Works Adilabad - Sakshi

తాంసి: తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని ఎమ్మెల్యే బాపూరావు అన్నారు.  కప్పర్లలో మంగళవారం రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి చైర్మన్‌ లోక భూమారెడ్డితో కలిసి కప్పర్లను సందర్శించారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాపూరావును, లోక భూమారెడ్డిని గ్రామస్తులు సన్మానించారు. గ్రామ సమస్యలు వారి దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఎమ్మె ల్యే కప్పర్ల నుంచి నిపాని వరకు రోడ్డుకు రూ.6 లక్షలు , రైతు వేదిక భవనం కోసం రూ.12 లక్షలు, రెండు ఆలయాలకోసం దేవదాయశాఖ తరఫున రూ.80 లక్షలు కేటాయిస్తామని గ్రామస్తులకు తెలిపారు.

లోక భూమారెడ్డి మాట్లాడుతూ త్వరలో రైతులకు 50 శాతం సబ్సిడీతో రైతుకు గేదెలు పంపిణీ చేస్తామని, సొసైటీలు ఏర్పాటు చేసుకొని రుణాలు పొందాలని సూచించారు. సహకార సంఘం చైర్మన్‌ కృష్ణారెడ్డి, మార్కెట్‌ డైరెక్టర్‌ సదానంద్, వీడీసీ అధ్యక్షుడు శేఖర్, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కృష్ణ, నాయకులు శ్రీధర్‌ రెడ్డి,నారాయణ,మహేందర్‌ ఉన్నారు.   

Advertisement
 
Advertisement
 
Advertisement