టీఆర్‌ఎస్‌కు 16 సీట్లు వస్తే  రాజకీయ సన్యాసం

TRS Government Has Nothing to Do With The People Says Uttam - Sakshi

చందంపేట: టీఆర్‌ఎస్‌ పార్టీకి ఈ పార్లమెంట్‌ ఎన్నికల్లో 16 సీట్లు వస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని టీపీసీసీ చీఫ్, నల్లగొండ ఎంపీ అభ్యర్థి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గురువారం నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో జరిగిన ప్రచారంలో ఆయన మాట్లాడారు. ప్రాజెక్టులు నిర్మిస్తామని, ఇళ్లు కట్టిస్తామని తండ్రీకొడుకులు బూటకపు మాటలు చెప్పి పూట గడుపుతున్నారని ఎద్దేవా చేశారు. ఏ ఒక్క చోట కూడా డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. మాయ మాటలు చెబుతూ ప్రజలను మోసం చేయడమే తప్ప టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. రాహుల్‌ గాంధీ ప్రధాని కావడమే ధ్యేయంగా పని చేస్తున్నామని, రానున్న ఎన్నికల్లో ఆయన ప్రధాని కావడం ఖాయమన్నా రు. ఈ కార్యక్రమంలో సీఎల్పీమాజీ నేత జానా రెడ్డి, బాలునాయక్‌ పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top