రామాలయం వద్ద ఆదివాసీల నిరసన | Tribals protest at Ram Temple | Sakshi
Sakshi News home page

రామాలయం వద్ద ఆదివాసీల నిరసన

Feb 15 2016 2:31 PM | Updated on Sep 3 2017 5:42 PM

భద్రాచల రామాలయంలో ప్రైవేటీకరణ దిశగా చేపట్టే చర్యలపై ఆదివాసీలు నిరసన తెలిపారు.

భద్రాచల రామాలయంలో ప్రైవేటీకరణ దిశగా చేపట్టే చర్యలపై ఆదివాసీలు నిరసన తెలిపారు. సోమవారం మధ్యాహ్నం ఆలయ కార్యనిర్వహణాధికారి కార్యాలయం ఎదుట ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆలయంలోని సీతారాముల విగ్రహాలను అమెరికాకు చెందిన సంస్థకు విక్రయించే యత్నాన్ని వారు నిరసించారు. దీంతో పాటు... ఆలయంలో వివిధ విభాగాలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడాన్ని ఖండించారు. ఆదివాసీ యువతకు ఆలయంలో ఉద్యోగాలివ్వాలని డిమాండ్ చేశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement