భూముల కోసం ఎమ్మార్వోకు గిరిజనుల ఫిర్యాదు | tribals complains to MRO for crop lands | Sakshi
Sakshi News home page

భూముల కోసం ఎమ్మార్వోకు గిరిజనుల ఫిర్యాదు

Mar 3 2015 1:21 PM | Updated on Sep 2 2017 10:14 PM

భూముల కోసం ఎమ్మార్వోకు గిరిజనుల ఫిర్యాదు

భూముల కోసం ఎమ్మార్వోకు గిరిజనుల ఫిర్యాదు

‘‘గత ఇరవై సంవత్సరాలుగా ఈ భూములను మేమే సాగు చేసుకుంటున్నాం..

అశ్వరావుపేట: ‘‘గత ఇరవై సంవత్సరాలుగా ఈ భూములను మేమే సాగు చేసుకుంటున్నాం.. ఇప్పుడు అటవీశాఖ వాళ్లొచ్చి ఈ జమీన్ సర్కారోళ్లదని కంచె వేస్తున్నారు. మీరైనా న్యాయం చేయండి’’ అని గిరిజనులు అశ్వరావుపేట తహశీల్దార్‌కు మొరపెట్టుకున్నారు. ఖమ్మం జిల్లా అశ్వరావుపేట మండలం ఉట్లపల్లిగ్రామంలో అటవీ అధికారులు తమ భూముల్లో కంచె వేస్తున్నారని ఫిర్యాదు చేయడంతో మంగళవారం తహశీల్దార్ భవాని సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ప్రస్తుతం ఉన్న పంటలను కొనసాగించుకోనివ్వాలని ఆ తర్వాత సర్వే నంబర్ల ప్రకారం కంచెలు వేసుకోవాలి.. ఒకవేళ స్థానికుల వద్ద పాస్‌పుస్తకాలు లేని భూమి కొలతల్లో బయటపడితే దాన్ని అటవీశాఖకు అప్పగిస్తామని ఆమె తెలిపారు.


 

Advertisement
 
Advertisement
Advertisement