మల్కాజిగిరి నుంచి బాసరకు రైళ్లు | trains from malkajgiri to basara | Sakshi
Sakshi News home page

మల్కాజిగిరి నుంచి బాసరకు రైళ్లు

Jul 8 2015 8:06 PM | Updated on Sep 3 2017 5:08 AM

మల్కాజిగిరి నుంచి బాసరకు రైళ్లు

మల్కాజిగిరి నుంచి బాసరకు రైళ్లు

గోదావరి పుష్కరాలకు మల్కాజిగిరి రైల్వే స్టేషన్ నుంచి బాసరకు ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉన్నట్లు సబర్బన్ ట్రెన్ అండ్ బస్ ట్రావెలర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నూర్ అహ్మద్ తెలిపారు.

హైదరాబాద్: గోదావరి పుష్కరాలకు మల్కాజిగిరి రైల్వే స్టేషన్ నుంచి బాసరకు ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉన్నట్లు సబర్బన్ ట్రెన్ అండ్ బస్ ట్రావెలర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నూర్ అహ్మద్ తెలిపారు. ఈ నెల 13వ తేదీ నుంచి 19 వరకు, తిరిగి 21 నుంచి 26 వరకు మల్కాజిగిరి రైల్వే స్టేషన్‌లో ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక రైలు పుష్కరాలకు వెళ్లే వారికి అందుబాటులో ఉంటుందన్నారు. బొల్లారం, మేడ్చల్, మనోహరాబాద్, మిర్జాపల్లి, కామారెడ్డి, నిజామాబాద్ రైల్వేస్టేషన్‌లలో మాత్రమే ఈ రైళ్లు ఆగుతాయని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement