ట్రేడ్ యూనియన్ల రిజిస్ట్రేషన్ తప్పనిసరి | trade unions registrations mandatory | Sakshi
Sakshi News home page

ట్రేడ్ యూనియన్ల రిజిస్ట్రేషన్ తప్పనిసరి

Jul 16 2014 3:22 AM | Updated on Sep 2 2017 10:20 AM

అన్ని విభాగాల్లోనూ ట్రేడ్ యూనియన్ల రిజస్ట్రేషన్‌ను తప్పనిసరిగా చేపట్టాలని రాష్ర్ట హోం, కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అధికారులను ఆదేశించారు.

 45 రోజుల్లోగా పూర్తి చేయాలి: మంత్రి నాయిని
 
 సాక్షి, హైదరాబాద్: అన్ని విభాగాల్లోనూ ట్రేడ్ యూనియన్ల రిజస్ట్రేషన్‌ను తప్పనిసరిగా చేపట్టాలని రాష్ర్ట హోం, కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అధికారులను ఆదేశించారు. 45 రోజుల్లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఇందుకు సహకరించని అధికారులపై కఠిన చర్యలు చేపడతామన్నారు. అలాగే నెల రోజుల్లోగా కార్మికుల కనీస వేతనాల బోర్డులను, సంక్షేమ బోర్డులను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో మంగళవారం జరిగిన తెలంగాణ కార్మిక సంఘాల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
 

Advertisement
 
Advertisement
Advertisement