రూ. 7 లక్షల కలప దుంగలు స్వాధీనం | Timber logs seized | Sakshi
Sakshi News home page

రూ. 7 లక్షల కలప దుంగలు స్వాధీనం

Nov 2 2015 1:09 PM | Updated on Sep 3 2017 11:54 AM

వరంగల్ జిల్లా భూపాలపల్లి మండలంలో అక్రమంగా తరలిస్తున్న 13 కలప బండ్లను పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు.

వరంగల్ జిల్లా భూపాలపల్లి మండలంలో అక్రమంగా తరలిస్తున్న 13 కలప బండ్లను పోలీసులు సోమవారం  స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. సింగరేణి ఏరియా ఆస్పత్రి సమీపంలో భూపాలపల్లి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో అటుగా వస్తున్న బండ్లను తనిఖీ చేయగా.. అక్రమంగా తరలిస్తున్న దుంగలు కనిపించాయి. స్వాధీనం చేసుకున్న కలప బండ్ల విలువ రూ. 7 లక్షల వరకు ఉంటుందని పోలీసుల తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement