ఆవాసానికి పులి అన్వేషణ

Tiger Walking in Forest For Permanent Shelter Adilabad - Sakshi

రోజుకు కిలో మీటర్లు నడుస్తున్న ఏ2 పులి

అడ్డుకుంటున్న ఏ1, కే4

భీమారం(చెన్నూర్‌): మహారాష్ట్ర నుంచి జిల్లాకు వచ్చిన పెద్దపులి ఆవాసం కోసం భీమారం, చెన్నూరు, కోటపల్లి మ ండలాల్లోని అడవిలో  తిరుగుతోంది. రెండు నెలల క్రితం వచ్చిన ఏ2 మగపెద్దపులికి ఇప్పటి వరకు సరైన స్థావరం దొరకక అడవులను జల్లెడ పడుతోంది. అయి తే ఇప్పటికే ఈ ప్రాంతంలో ఏ1 మగ, కే4 ఆడ పెద్ద పులులు రెండేళ్ల నుంచి నివాసం ఏర్పాటు చేసుకుని ఉన్నాయి. కొత్తగా వచ్చిన పులిని సమీప అడవిలోకి రానివ్వడం లేదని అటవీ శాఖాదికారులు చెబుతున్నారు. ఒ ంటరిగా ఉన్న ఏ2 మగ పులి దట్టమైన అడవులతో పాటు మైదాన ప్రాంతంలో సంచిరిస్తుంది. ముఖ్యంగా అటవీ ప్రాంతం అధికంగా ఉన్న కోటపల్లి మండలం పంగిడి సోమారంతో పాటు భీమారం ప్రాంతం గుండా తిరుగుతూ ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. భీమారం స మీపంలో గొల్లవాగు ప్రాజెక్ట్‌ ఉండటం, అది దట్టమైన అడవి ప్రాంతం కావడంతో పాటు చెన్నూరు మండలం బుద్దారం అటవీ ప్రాంతానికి కలిసి ఉండటంతో పెద్దపులులు స్థావరంగా మార్చుకున్నాయి. ఇప్పటికే  రెండు పులులు ఇక్కడ కేంద్రంగా చేసుకుని పలు ప్రాంతాల్లో సంచరిస్తున్నాయి.  ప్రభుత్వం పులుల సంరక్షణకు ఈ ప్రాంత ంలో  సదుపాయాలు కల్పించకపోయిన ఇక్కడ వాటికి అనుకూలమైన పరిస్థితలు ఉండటంతో దీర్ఘకాలంగా ఉంటున్నాయి.

రోజుకు 25మీటర్ల నడక
ఆవాసం కోసం ఆరాటపడుతున్న ఏ2 మగ పెద్దపులి ప్రతిరోజు 25కిలో మీటర్లకి పైగా నడక కొనసాగిస్తుందని అటవీశాఖ అధికారులు అంచనాకి వచ్చారు. ఒకే రోజు రెండు మండలాలను చుట్టి వస్తుందని వారు పేర్కొంటున్నారు. చెన్నూరు మండలం ఆస్నాద్‌ వెళ్లిన పులి అదే రాత్రి కోటపల్లి మండలం పారిపెల్లి మరుపటి రోజు మల్లంపేట, పంగిడి సోమారం మీదుగా తిరిగి భీమారం మండలం నర్సింగాపూర్‌ చేరుకుంది. దీనిని పరిశీలిస్తున్న అటవీశాఖ అధికారులు పాద ముద్రలు సేకరిస్తూ రక్షణ కోసం చర్యలు చేపడుతున్నారు.

రాత్రంతా అడవిలోనే పశువులు..
రెండు రోజుల క్రితం భీమారంలోని గొల్లవాగు ప్రాజెక్ట్‌ సమీపం గుండా కలప డిపో మీదుగా ఎలకేశ్వరం వెళ్లిన పులిని చూసిన పశువులు రాత్రి ఇంటికి రాలేదు.  గ్రామంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పశువులు మేత కోసం ప్రాజెక్ట్‌ వైపు అడవికి మేత కోసం వెళ్లాయి. అయితే  పులి కనపడటంతో పశువులు భయపడి అడవిలోనే ఉండిపోయాయి. మరుసటి రోజు గ్రామస్తులు వెళ్లి పశువులను తీసుకవచ్చారు. ఇప్పటికే ఈ అడవిలో సంచరిస్తున్న కే4, ఏ1 పెద్దపులులకు భిన్నంగా ఏ2 మగపులి అడవులతో పాటు  మైదాన ప్రాంతంలో సంచరిస్తుండంతో దాని భద్రతపై అటవీశాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనేది చర్చానీయాంశంగా మారింది. 

శంకర్‌పల్లి శివారులో పులి సంచారం
మందమర్రిరూరల్‌: మండలంలోని శంకర్‌పల్లి గ్రామ శివారులో పులి అడుగులను అధికారులు మంగళవారం గుర్తించారు. వారి వివరాల ప్రకారం... మధ్యాహ్నం మామిడిగట్టు అటవీ ప్రాంతం నుంచి ఆదిల్‌పేట్, చిర్రకుంట అటవీ ప్రాంతం గుండా శంకర్‌పల్లి అటవీ ప్రాంతంలో సంచరించినట్లు అడుగుల ద్వారా గుర్తించారు. సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అటవీ ప్రాంతానికి గొర్రెల, పశువుల కాపరులు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top