
వరంగల్ రూరల్ జిల్లా కలెక్టరేట్
సాక్షి, వరంగల్: వరంగల్ రూరల్ జిల్లా ఏర్పాటై ఈ దసరాతో మూడేళ్లవుతున్నా.. జిల్లా కేంద్రం ఎక్కడ అనేది ఖరారు కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా ఏర్పాటైన జిల్లాలకు కలెక్టరేట్ సముదాయాలు చివరి దశలో ఉన్నాయి. దీనికి విరుద్ధంగా రూరల్ జిల్లా కేంద్రం ఉండటంతో ప్రజలు అయోమయానికి గురవుతున్నారు.