గ్లోబల్ సమ్మిట్ వేదికగాఆవిష్కరించిన సీఎం
ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం
సోనియాగాంధీ జన్మదిన ఉత్సవాలు కూడా..
సాక్షి, హైదరాబాద్: ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 వేదిక నుంచి రాష్ట్రంలోని 33 జిల్లా కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం వర్చువల్‌గా ఆవిష్కరించారు. దేశ, విదేశీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, మంత్రివర్గ సహచరుల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు.
‘తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు 2009 డిసెంబర్ 9వ తేదీన నాటి యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాం«దీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆదేశాల మేరకు అప్పటి హోం మంత్రి చిదంబరం ప్రకటించారు. ఎన్ని అడ్డంకులు, ఆటంకాలు ఎదురైనా సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు. ఆమె జన్మదినం డిసెంబర్ 9. ఈ రోజున రాష్ట్ర ఏర్పాటు ప్రకటన తెలంగాణ ప్రజలకు సంతోషాన్ని ఇచి్చంది.. వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది.
అందుకే ప్రతి ఏడాది ఈ రోజున తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించుకున్నాం. తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చిన సోనియాగాంధీ జన్మదిన ఉత్సవాలను జరుపుకుంటాం..’అని సీఎం స్పష్టం చేశారు.
సోనియా ఆరు దశాబ్దాల ఆకాంక్ష నెరవేర్చారు
‘ఆరు దశాబ్దాల ఆకాంక్ష, 4 కోట్ల మంది ప్రజల కోరి కను కరీంనగర్‌లో జరిగిన సమావేశంలో సోనియాగాంధీ ప్రకటించడమే కాకుండా రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. గత ఏడాది ప్రజా పాలనకు సంకేతంగా ఉన్న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించాం.
ఇప్పుడు జిల్లాల్లో పాలనా కేంద్రాలైన కలెక్టర్ కార్యాలయాల్లో విగ్రహాలను ఆవిష్కరించడం సంతోషకరం..’అని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, సీఎస్ రామకృష్ణారావు ఉన్నతాధికారులు, జిల్లాల నుంచి కలెక్టర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


