‘ఎరువుల కొరత లేదు’

There is no shortage of urea in the state says niranjan reddy - Sakshi

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌/పెద్దపల్లి: రాష్ట్రంలో యూరియాకు ఎలాంటి కొరత లేదని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. బుధవారం కరీంనగర్, పెద్దపల్లి కలెక్టరేట్‌లలో వ్యవసాయ అధికారులతో ఆయన సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. అన్ని జిల్లాలలో యూరియా స్టాక్‌ ఉందని, ప్రతిరోజు నేరుగా జిల్లాలకు యూరియా పంపుతున్నామని తెలిపారు. ప్రస్తుతం యూరియా స్టాక్‌ ఉన్నప్పటికీ కేంద్రం ప్రవేశపెట్టిన ‘పాయింట్‌ ఆఫ్‌ సేల్‌’ విధానం వల్ల పంపిణీలో ఆలస్యం జరుగుతోందని తెలిపారు.

దీని వల్ల యూరియా స్టాక్‌ ఉన్నప్పటికీ రైతులు లైన్లలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. దీనిపై ప్రజలకు అవగాహ న కలి్పంచి, యూరియా కోసం తొందర పడవద్దని వ్యవసాయాధికారులు రైతులకు భరోసా కలి్పంచా లని సూచించారు.  రాష్ట్రంలో ఏడు వేల కేంద్రాల్లో ఎరువుల పంపిణీ జరుగుతోందని స్పష్టం చేశారు. ఐదారు చోట్ల మాత్రం ఎరువులు సకాలంలో అం దలేదని, దీన్ని రాష్ట్రవ్యాప్త కొరతగా ప్రతిపక్షాలు దు్రష్పచారం చేస్తున్నాయని మండిపడ్డారు. రైతుబంధుపై ఎలాంటి అపోహలు అవసరం లేదని.. ఎంత భూమి ఉంటే అంత రైతుబంధు స్కీం వర్తింపజేస్తామన్నారు. ఆయా సమావేశాల్లో మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top