దొంగ.. దొంగ.. | there is no patrolling system | Sakshi
Sakshi News home page

దొంగ.. దొంగ..

Sep 5 2014 1:56 AM | Updated on Aug 30 2018 5:27 PM

జిల్లాలో దొంగతనాలు జరుగుతున్న తీరు ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది.

ఆదిలాబాద్ క్రైం : జిల్లాలో దొంగతనాలు జరుగుతున్న తీరు ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 72 పోలీ  సుస్టేషన్ల పరిధిలో ఆగస్టు నాటికే 418 కేసులు నమోదు కావడం గమనార్హం. వీటిలో రాత్రి సమయంలో చోరీలే ఎక్కువగా ఉన్నాయి. శివారు ప్రాంతాలే కా కుండా జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్‌లో నే దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి.

వీటిలో పోలీసు రికార్డుల్లోకి ఎ క్కినవి కొన్ని మాత్రమే. పరువు పోతుం దనే ఉద్దేశంతో కొందరు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడమే అందుకు కారణంగా తెలుస్తోంది. ‘పోయిందేదో పో యింది.. కేసులంటూ మళ్లీ పోలీసు స్టేష న్ల చుట్టూ ఎందుకు తిరగడం..’ అనుకు ని ఫిర్యాదుకు వెనుకడుగు వేస్తున్నారు.

 నిద్రావస్థలో నిఘా..
 దొంగతనాలను అరికట్టడంలో పోలీసుల  వైఫల్యం కనిపిస్తోంది. చోరీలను అరికట్టడానికి పలు విభాగాలు ఉన్నా ఫలితం కనిపించడం లేదనే విమర్శలున్నాయి. స్థానికంగా ఉంటూ నేరాలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచి నేరస్తులను పట్టుకోవాల్సిన ఐడీ పార్టీ పనితీరు ప్రశ్నార్థకంగా మారింది.

గతంలో జరిగిన నేరాల తీరు ను పరిశీలించడం, పాత నేరస్తులను విచారించడం, నేరాలకు పాల్పడుతున్న వారి ని పట్టుకోవడం ఈ విభాగం ప్రధాన విధి. కానీ ఐడీ పార్టీలోని కొందరు అసలు విధులను పక్కనబెట్టి ఆయా పోలీసుస్టేష న్ల పరిధిలో పోలీసు అధికారులకు వసూ లు చేసి పెడుతున్నారనే ఆరోపణలు విని పిస్తున్నాయి. కొత్తగా వచ్చిన ఐడీ పార్టీ కా నిస్టేబుళ్లు విధులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. దొంగతనం జరిగిన చోట వేలిముద్రలు సేకరించి వాటి ద్వారా నేరస్తులను పట్టుకోవడంలో క్లూస్ టీం, ఫింగర్‌ప్రింట్స్ విభాగం సహకరి స్తుంది.

భారీ చోరీలకు పాల్పడుతున్న నేరస్తులను పట్టుకోవడానికి ప్రత్యేకంగా సీసీఎస్ విభాగం కూడా ఉంది. అయినప్పటికీ చోరీలు ఆగడం లేదు. రాత్రి సమయంలో పెట్రోలింగ్‌లో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. బీట్ డ్యూటీ  లు సరిగ్గా చేయకపోవడం వల్లే చోరీలకు అవకాశం ఇచ్చినట్లవుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పెట్రోలింగ్‌లో అలసత్వం ప్రదర్శిస్తుండడం వల్లే ఆదిలాబాద్‌లో నిత్యం దొంగతనాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. గత ఆరు నెలల్లో జిల్లాలో 418 దొంగతనాలు జరిగాయంటే దొంగలు ఏ విధంగా చెలరేగిపోతున్నారో చెప్పనక్కర్లేదు.  

 దొంగతనాలు అరికట్టేందుకు చర్యలు.. - జోయల్ డేవిస్, ఆదిలాబాద్ ఏఎస్పీ
 దొంగతనాలు అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. త్వరలో ఐడీ పార్టీ కొత్త బృందాల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నాం. పాత కేసులకు సంబంధించిన నేరస్తులను పట్టుకోవడం, తరచూ దొంగతనాలకు పాల్పడే వారిపై దృష్టి సారించాలని ఐడీ పార్టీ బృందాలను ఆదేశించాం. రాత్రి సమయంలో ఐడీ పార్టీ, సీసీఎస్ బృందాలతో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాం. ఆదిలాబాద్‌లోని ప్రధాన కాలనీలు, కూడళ్లలో దొంగతనాల నివారణకు త్వరలో సీసీ కెమెరాలు ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నాం. ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నట్లు తెలిస్తే మాకు సమాచారం అందించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement