పండగపూట విషాదం | The tragedy on festival | Sakshi
Sakshi News home page

పండగపూట విషాదం

Jun 27 2017 2:52 AM | Updated on Sep 5 2018 2:26 PM

రంజాన్‌ పండగా రోజు ఆ ఇంట్లో విషాదం నెలకొంది.

బాలుడిపై విద్యుత్‌ తీగ పడి దుర్మరణం
 
అత్తాపూర్‌ (రాజేంద్రనగర్‌): రంజాన్‌ పండగా రోజు ఆ ఇంట్లో విషాదం నెలకొంది. ఇంట్లో సామానులను తీసుకురావడానికి బయటకు వెళ్లిన బాలుడు కరెంట్‌ తీగ మీదపడి అక్కడికక్కడే మృతిచెందాడు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ సర్కిల్‌ పరిధిలోని సులేమాన్‌నగర్‌ ప్రాంతానికి చెందిన హమీద్, షబాన్‌బేగం దంపతులకు ముజమిల్‌(8) ఒక్కగానొక్క కుమారుడు. రంజాన్‌ పండగ కావడంతో ముజమీల్‌ సోమవారం సామాన్లు తీసుకురావడానికి బయటకు వెళ్లాడు.

ఇంద్రానగర్‌లోని దుకాణం వద్దకు వెళ్తుండగా విద్యుత్‌ స్తంభంపై ఉన్న తీగ ఒక్కసారిగా తెగి బాలుడిపై పడింది. దీంతో విద్యుత్‌షాక్‌కు గురైన బాలుడు విలవిలలాడుతూ అక్కడికక్కడే మృతిచెందాడు. రాజేంద్రనగర్‌ పోలీసులు ఘటనస్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement