వడదెబ్బకు ఓ పదో తరగతి విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది.
వడదెబ్బకు ఓ పదో తరగతి విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం రాఘవాపురం తండాకు చెందిన అంజలి పదో తరగతి పరీక్షలు రాస్తోంది. అధిక ఉష్ణోగ్రతల ప్రభావంతో ఆమె వడదెబ్బకు గురై అస్వస్థత పాలైంది. దీంతో తల్లిదండ్రులు ఆమెను గురువారం ఆస్పత్రిలో చూపించి ఇంటికి తీసుకెళ్లారు. రాత్రి సమయంలో పరిస్థితి విషమించి అంజలి మృతి చెందింది.