ఆరుగేట్ల ద్వారా నీటి విడుదల | The release of water by six gets | Sakshi
Sakshi News home page

ఆరుగేట్ల ద్వారా నీటి విడుదల

Sep 18 2014 1:27 AM | Updated on Oct 19 2018 7:22 PM

ఆరుగేట్ల ద్వారా నీటి విడుదల - Sakshi

ఆరుగేట్ల ద్వారా నీటి విడుదల

సాగర్ జలాశయం నుంచి కృష్ణమ్మ ఆరుగేట్ల ద్వారా పరుగులిడుతోంది.

నాగార్జునసాగర్ : సాగర్ జలాశయం నుంచి కృష్ణమ్మ ఆరుగేట్ల ద్వారా పరుగులిడుతోంది. మంగళవారం రాత్రి 10గంటలకు రెండు గేట్లనుంచి నీటిని విడుదలచేసిన అధికారులు కృష్ణానది పరీవాహక ప్రాంతంలో కురిసిన వర్షాలకు ఉపనదుల ద్వారా వచ్చిన వరదలతో సాగర్ జలాశయం నీటిమట్టం బుధవారం సాయంత్రం అనూహ్యంగా రెండు పాయింట్లు పెరగడంతో ఆరుగేట్ల నుంచి వదులుతున్నారు. ఆరుగేట్ల ద్వారా దిగువకు 48,600 క్యూసెక్కులనీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి కృష్ణానది ద్వారా కేవలం 32,800 క్యూసెక్కుల నీరు మాత్రమే వచ్చి చేరుతోంది. క్రస్ట్‌గేట్లను మూసివేశారు.

కేవలం విద్యుదుత్పాదన ద్వారా సాగర్ జలాశయంలోకి 51,599 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. గడిచిన 24గంటల్లో సాగర్ జలాశ యం నుంచి 99,367 క్యూసెక్కుల వరదనీరు భయటకు వెళ్లింది. అంతేమోతాదులో శ్రీశైలం జలాశయం నుంచి వచ్చి చేరింది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం నీటిమట్టం 884.40 అడుగులు( 212.4385 టీఎంసీలు) ఉంది. కాగా గరిష్టనీటిమట్టం 885అడుగులు( 215.8 టీఎంసీలు). సాగర్‌నీటిమట్టం 590అడుగులు. ప్రసుతం గరిష్టస్థాయిలో ఉంది. ఎగువ నుంచి వచ్చే వరద తగ్గండతో గేట్లు మూసివేసే అవకాశాలున్నాయి.
 
కొనసాగుతున్న పర్యాటకుల సందడి
సాగర్ వద్ద పర్యాటకుల సందడి కొనసాగుతోంది. కృష్ణమ్మ సోయగాలను తనివితీరా చూసేందుకు ైెహ దరాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, వరంగల్, నల్లగొండ తదితరప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement