'పోలీసులు సరిగానే వ్యవహరించారు' | 'The police acted properly' | Sakshi
Sakshi News home page

'పోలీసులు సరిగానే వ్యవహరించారు'

Apr 4 2015 2:24 PM | Updated on Sep 2 2017 11:51 PM

కుందూరు జానా రెడ్డి

కుందూరు జానా రెడ్డి

నల్గొండ జిల్లా మోత్కూరు మండలం జానకీపురం శివారులో శనివారం ఉదయం ఎన్కౌంటర్ ఘటనలో పోలీసులు సరిగ్గా వ్యవహరించినట్లు సీఎల్పీ నేత కుందూరు జానా రెడ్డి పేర్కొన్నారు.

హైదరాబాద్:  నల్గొండ జిల్లా  మోత్కూరు మండలం  జానకీపురం శివారులో శనివారం ఉదయం ఎన్కౌంటర్ ఘటనలో పోలీసులు సరిగ్గా వ్యవహరించినట్లు  సీఎల్పీ నేత కుందూరు జానా రెడ్డి పేర్కొన్నారు. దుండగులు జరిపిన ఎదురు కాల్పులలో కానిస్టేబుల్ నాగరాజు మృతి చెందగా, ఆత్మకూరు ఎస్ఐ సిద్ధయ్య, రామన్నపేట సీఐ బాలగంగిరెడ్డికి తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే.

కానిస్టేబుల్ నాగరాజు నాగరాజు కుటుంబానికి జానారెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సూర్యాపేట ఘటనలో, ఈ రోజు జరిగిన ఎదురు కాల్పులలో పోలీసులు మృతి చెందడం దురదృష్టకరం అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement