దమ్ముంటే ప్రత్యేక ప్యాకేజీ తీసుకురావాలి | The guts to get special package | Sakshi
Sakshi News home page

దమ్ముంటే ప్రత్యేక ప్యాకేజీ తీసుకురావాలి

Feb 6 2015 6:54 AM | Updated on Mar 23 2019 9:10 PM

ఢిల్లీకి వెళుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దమ్ముంటే తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీని తీసుకురావాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సవాల్ చేశారు.

  • ముఖ్యమంత్రికి పొన్నం సవాల్
  • సాక్షి, హైదరాబాద్: ఢిల్లీకి వెళుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దమ్ముంటే తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీని తీసుకురావాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సవాల్ చేశారు. సీఎల్పీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణను తానే  తెచ్చినట్టుగా కేసీఆర్ చెప్పుకుంటున్నారన్నారు. అలా అయితే కేసీఆర్‌కు ఉన్న అవే శక్తి సామర్థ్యాలను కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ, పరిశ్రమలకు రాయితీలు ఇప్పించడానికి వినియోగించాలని అన్నారు.

    సీఎం కేసీఆర్ పాలన తుగ్లక్‌ను మించి పోయిందని విమర్శించారు. ప్రభుత్వ ఆస్తులను, రెండు రాష్ట్రాలకు సరిపోయేస్థాయిలో ఉన్న సచివాలయాన్ని కూడా అమ్మడానికి కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజా ప్రయోజనాలకోసం ప్రభుత్వ ఆస్తులను సమకూర్చాలి తప్ప ఉన్నవాటిని అమ్మాలనే నిర్ణయం సరికాదని పొన్నం ప్రభాకర్ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement