విద్యుత్ తీగలు తగిలి రైతు మృతి | The farmer 's death with Electric shock | Sakshi
Sakshi News home page

విద్యుత్ తీగలు తగిలి రైతు మృతి

Oct 24 2015 8:29 AM | Updated on Oct 1 2018 4:01 PM

పొద్దున్నే పొలానికి వెళుతున్న ఓ రైతును తెగిపడిన విద్యుత్ తీగలు బలితీసుకున్నాయి.

పొద్దున్నే పొలానికి వెళుతున్న ఓ రైతును తెగిపడిన విద్యుత్ తీగలు బలితీసుకున్నాయి. ఖమ్మం జిల్లా చింతకాని మండలం సీతంపేటకు చెందిన రైతు చంద్రకాని గోపయ్య (35) శనివారం తెల్లవారుజామున పొలానికి నీరు పెట్టేందుకు వెళుతున్నాడు. మార్గమధ్యంలో 11కేవీ లైన్ తీగలు తెగి పడి ఉన్నాయి. చీకట్లో వాటిని తాకిన గోపయ్య విద్యుదాఘాతంతో తీగలపైనే పడి ప్రాణాలు వదిలాడు.

ఉదయం అటువైపు వెళ్లిన రైతులు  గోపయ్యను చూసి విద్యుత్‌శాఖ అధికారులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement