అప్పులు తీర్చలేక.. | The farmer commits suicide | Sakshi
Sakshi News home page

అప్పులు తీర్చలేక..

Nov 22 2015 2:24 PM | Updated on Oct 1 2018 2:36 PM

అప్పుల వారి బాధ తాళలేక ఓ రైతు కరెంటు పట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

అప్పలు ఇచ్చిన వారి బాధలు తట్టుకోలేక ఓ రైతు విద్యుత్ తీగలు పట్టుకొని ఆత్మహుతి చేసుకున్నాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా పెద్ద అడిశర్లపల్లి మండలం చిలకమర్తి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన యాదయ్య చారీ(38) వ్యవసాయ పెట్టుబడుల నిమిత్తం గ్రామానికి చెందిన కొంత మంది వద్ద అప్పు తీసుకున్నాడు. పంట దిగుబడి లేక పోవడంతో చేసిన అప్పులు తీర్చలేకపోయాడు. దీంతో అప్పు ఇచ్చిన వాళ్లు వత్తిడి చేయడంతో.. రెండు రోజుల నుంచి ముభావంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో ఇదే అంశం పై ఆదివారం ఉదయం భార్య భర్తల మధ్య గొడవ జరగడంతో.. బావి వద్దకు వె ళ్తున్నానని చెప్పి వెళ్లి అక్కడ మోటర్ దగ్గర ఉన్న విద్యుత్ తీగలను పట్టుకొని మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


 

Advertisement
 
Advertisement
Advertisement