6 నుంచి ‘టీజీటీ’ సర్టిఫికెట్ల పరిశీలన | TGT Certificates Verification From March 6 | Sakshi
Sakshi News home page

6 నుంచి ‘టీజీటీ’ సర్టిఫికెట్ల పరిశీలన

Feb 26 2018 2:35 AM | Updated on Feb 26 2018 2:35 AM

TGT Certificates Verification From March 6 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గురుకులాల్లోని ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌(టీజీటీ ఆప్షనల్స్‌) పోస్టుల భర్తీలో భాగంగా రెండోసారి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను మార్చి 6 నుంచి 9 వరకు నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. 6వ తేదీ నుంచి ప్రతిరోజూ ఉదయం 10 గంటలకు నాంపల్లిలోని టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో వెరిఫికేషన్‌ ప్రారంభం అవుతుందని వెల్లడించింది.

వెరిఫికేషన్‌కు వెంట తెచ్చుకోవాల్సిన సర్టిఫికెట్ల వివరాలు, హాజరు కావాల్సిన అభ్యర్థుల జాబితాను తమ వెబ్‌సైట్‌లో పొందవచ్చని వివరించింది. అభ్యర్థుల కొరత, మొదట నిర్వహించిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు గైర్హాజరు వంటి కారణాలతో రెండోసారి వెరిఫికేషన్‌ నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. అభ్యర్థులను 1:2 నిష్పత్తిలో వెరిఫికేషన్‌కు పిలిచినట్లు తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement