‘పది’లో కాకతీయ ప్రభంజన | 'Tenth' top in the Kakatiya | Sakshi
Sakshi News home page

‘పది’లో కాకతీయ ప్రభంజన

May 20 2015 4:06 AM | Updated on Oct 30 2018 7:39 PM

పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన కాకతీయ విద్యార్థులను ఆర్‌ఐఓ విజయ్‌కుమార్ మంగళవారం సన్మానించారు.

విద్యార్థులను సన్మానించిన ఆర్‌ఐఓ
నిజామాబాద్‌అర్బన్ : పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన కాకతీయ విద్యార్థులను ఆర్‌ఐఓ విజయ్‌కుమార్ మంగళవారం సన్మానించారు. 10 జీపీఏ సాధించిన సీహెచ్.దినేష్, ఆర్.జిగీషతో పాటు 9.8 జీపీఏ సాధించిన ఏడుగురిని అభినందించారు. ఈ సందర్భంగా ఆర్‌ఐవో మాట్లాడుతూ ఉత్తమఫలితాలు సాధించడంలో కాకతీయ విద్యార్థులు ముందంజలో ఉంటారని అన్నారు.

9 రాష్ట్ర స్థాయి జీపీఏ మార్కులతో 102 మంది, 8 రాష్ట్ర స్థాయి గ్రేడు మార్కులతో 300 మంది విద్యార్థులు ప్రభంజనం సృష్టించారన్నారు. ఈ సందర్భంగా హెచ్‌ఎం ఫరీదొద్దీన్  మాట్లాడుతూ.. ఇటీవల వెలువడిన ఐఐటీ రామయ్య ఫలితాల్లో కుమారి, జగదీష్, సీహెచ్.భానుతేజ ఎంపికయ్యారన్నారు. అంతేకాకుండా ఐఐటీ మెరుున్స్‌లో 20 మంది విద్యార్థులు సత్తా చాటారని అన్నారు. భవిష్యత్‌లో ఇదే స్ఫూర్తితో మెరుగైన  ప్రణాళికలతో విద్యార్థులను తీర్చిదిద్ది జాతీయ స్థాయిలో ప్రతిభ చూపేలా కృషి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో కాకతీయ హైస్కూల్ అధ్యాపకులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement