పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖని సింగరేణి ఏరియా ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
సింగరేణి ఏరియా ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత
Jun 23 2017 2:06 PM | Updated on Sep 2 2018 4:23 PM
పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖని సింగరేణి ఏరియా ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వారసత్వ ఉద్యోగాల కోసం వారం రోజులుగా సింగరేణి కార్మికులు సమ్మే చేస్తుండగా.. విధులకు హాజరైన కార్మికులతో యాజమాన్యం బొగ్గు ఉత్పత్తి చేస్తోంది. రామగుండం ఓసిపి 3 లో డంపర్ ఢీ కొట్టడంతో కార్మికుడు ఓవర్ హెడ్ మెన్ రాజేంద్రప్రసాద్ మృతి చెందాడు.
మృతికి యాజమాన్యం, గుర్తింపు కార్మిక సంఘమే కారణమంటూ సమ్మే చేస్తున్న జాతీయ కార్మిక సంఘాలు ఆందోళనకు దిగాయి. ఆస్పత్రి ఎదుట బైఠాయించి ధర్నాకు దిగడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమ్మెను విచ్చిన్నం చేయడానికి కార్మికులతో బలవంతంగా పని చేయిస్తూ కార్మికుల ప్రాణాలు తీస్తున్నారని ఆరోపిస్తున్నారు.
Advertisement
Advertisement