చీపురు పట్టిన సానియా మీర్జా! | Tennis Star Sania Mirza participated in Swachh Bharat | Sakshi
Sakshi News home page

చీపురు పట్టిన సానియా మీర్జా!

Oct 16 2014 3:24 PM | Updated on Jul 15 2019 9:21 PM

చీపురు పట్టిన సానియా మీర్జా! - Sakshi

చీపురు పట్టిన సానియా మీర్జా!

స్వచ్చ భారత్ కార్యక్రమంలో టెన్నిస్ స్టార్ సానియా మీర్జా హైదరాబాద్ లోని ప్రశాసన్ నగర్ పాల్గొన్నారు

హైదరాబాద్: ప్రధాని నరేంద్రమోడీ ఇచ్చిన  పిలుపు మేరకు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం కోసం హైదరాబాద్ లోని ప్రశాసన్ నగర్ లో  సానియా చీపురు పట్టి చెత్తను ఊడ్చారు. 
 
స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత తెలంగాణ ఐటీ శాఖామంత్రి కేటీఆర్, బాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధూ, షూటర్ అభినవ్ బింద్రాలను సానియా ఆహ్వానించారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో సానియా పాల్గొనడంతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. 
 
స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా వ్యాపారవేత్త అనిల్ అంబానీ, టాలీవుడ్ నటుడు నాగార్జున, టెన్నిస్ స్టార్ సానియా మీర్జాలతో సహా తొమ్మిది మందిని మోదీ ఆహ్వానించిన సంగతి తెలిసిందే. 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement