ఆటో బోల్తా : పది మందికి గాయాలు | ten injured in road accident | Sakshi
Sakshi News home page

ఆటో బోల్తా : పది మందికి గాయాలు

Apr 23 2015 3:30 PM | Updated on Sep 3 2017 12:45 AM

ఆటో బోల్తా : పది మందికి గాయాలు

ఆటో బోల్తా : పది మందికి గాయాలు

వేగంగా ప్రయాణిస్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడిన ప్రమాదంలో పదిమందికి గాయాలయ్యాయి.

నిజామాబాద్ : వేగంగా ప్రయాణిస్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడిన ప్రమాదంలో పదిమందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా పిట్లం మండలం తిమ్మానగర్ గ్రామ శివారులో గురువారం చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే... మెదక్ జిల్లా గరేడ్‌గాం నుంచి 14 మంది ప్రయాణికులతో పిట్లం వస్తున్న ఆటో.. తిమ్మానగర్ వద్ద అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను పిట్లం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆటో డ్రైవర్ అతివేగంతో నడపడమే ఈ ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement