'చంద్రబాబు.. కేసీఆర్‌ను చూసి నేర్చుకో' | telangana minister pocharam fire on chandrababu | Sakshi
Sakshi News home page

'చంద్రబాబు.. కేసీఆర్‌ను చూసి నేర్చుకో'

Mar 4 2017 7:17 PM | Updated on Aug 14 2018 11:02 AM

'చంద్రబాబు.. కేసీఆర్‌ను చూసి నేర్చుకో' - Sakshi

'చంద్రబాబు.. కేసీఆర్‌ను చూసి నేర్చుకో'

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

నిజామాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబునాయుడు తెలంగాణ ద్రోహి అని పోచారం ఆరోపించారు. నిజామాబాద్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను చూసి చంద్రబాబు ఎంతో నేర్చుకోవాల్సి ఉందన్నారు.

రాజకీయ పబ్బం గడుపుకోవడానికే రాష్ట్ర మంత్రుల నియోజకవర్గాల్లో టీడీపీ సభలు నిర్వహిస్తోందని విమర్శించారు. నిజాంసాగర్ ఆయకట్టు కాల్వల విషయంలో రైతులను తప్పుదోవ పట్టిస్తూ.. తెలంగాణ కాంగ్రెస్ నేతలు నాటకాలాడుతున్నారని మంత్రి పోచారం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement