బాహుబలిలో ఆ సీన్లు తొలగించాలి | telangana malala jac demands for removal of some scenes in bahubali movie | Sakshi
Sakshi News home page

బాహుబలిలో ఆ సీన్లు తొలగించాలి

Jul 8 2015 9:31 AM | Updated on Oct 8 2018 8:45 PM

బాహుబలిలో ఆ సీన్లు తొలగించాలి - Sakshi

బాహుబలిలో ఆ సీన్లు తొలగించాలి

బాహుబలి చిత్రంలో మాల కులస్తులను అవమానపరిచే సన్నివేశాలను, మాటలు ఉన్నాయని వాటిని తక్షణమే తొలగించాలని తెలంగాణ మాలల జేఏసీ చైర్మన్ బి.దీపక్ కుమార్ డిమాండ్ చేశారు.

హైదరాబాద్ : బాహుబలి చిత్రంలో మాల కులస్తులను అవమానపరిచే సన్నివేశాలను, మాటలు ఉన్నాయని వాటిని తక్షణమే తొలగించాలని తెలంగాణ మాలల జేఏసీ చైర్మన్ బి.దీపక్ కుమార్ డిమాండ్ చేశారు. ఆ దృశ్యాలను తొలగించకపోతే తెలంగాణలో ఆ చిత్రాన్ని అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు.

యూట్యూబ్లో మాలలను కించపరుస్తూ ప్రసారమైన సినిమా క్లిప్పింగ్స్ను ఇప్పటికే పోలీసులకు అందచేస్తూ ఫిర్యాదు చేశామన్నారు. ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలని దీపక్ కుమార్ డిమాండ్ చేశారు. మరోవైపు బాహుబలి చిత్రం జూలై 10 శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement