పరుగు పందెంలో కేటీఆర్! | Telangana IT Minister KTR participated in Airtel Hyderabad Marathan | Sakshi
Sakshi News home page

పరుగు పందెంలో కేటీఆర్!

Aug 24 2014 12:30 PM | Updated on Aug 17 2018 6:18 PM

పరుగు పందెంలో కేటీఆర్! - Sakshi

పరుగు పందెంలో కేటీఆర్!

ఎయిర్ టెల్ నిర్వహిస్తున్న హైదరాబాద్ మారథాన్ పోటీల్లో తెలంగాణ ఐటీశాఖ మంత్రి కే.తారకరామారావు(కేటీఆర్) ఉత్సాహంగా పాల్గొన్నారు.

హైదరాబాద్: ఎయిర్ టెల్ నిర్వహిస్తున్న హైదరాబాద్ మారథాన్ పోటీల్లో తెలంగాణ ఐటీశాఖ మంత్రి కే.తారకరామారావు(కేటీఆర్) ఉత్సాహంగా పాల్గొన్నారు. 
 
ఆదివారం ఉదయం నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వద్ద మొదలైన మారథాన్ లో కేటీఆర్ ఉత్సాహంగా పరుగులు తీశారు. మారథాన్ ను ఫుల్ మారథాన్ (42.195 కిలోమీటర్లు)గా, హాఫ్ మారథాన్ (21.1 కిలోమీటర్లు) గా విభజించారు. మారథాన్ పోటీలు గచ్చిబౌలి స్టేడియం వద్ద ముగిస్తాయి. 
 
ఎయిర్‌టెల్  హైదరాబాద్ మారథాన్‌లో పాల్గొనేందుకు వివిధ రాష్ట్రాల రన్నర్‌లు, విదేశీయులు భారీ ఎత్తున తరలివచ్చారు. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో శనివారం ఏర్పాటు చేసిన ఎక్స్‌పోకు వేలాదివుంది తరలివచ్చి టీ షర్ట్‌లు, బూట్లు, గూడీ, బ్యాగ్‌లు తీసుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement