ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కాలేజీలపై సర్కార్‌ కొరడా

Telangana Governments Serious Action On 150 Private Polytechnic Colleges - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలపై తెలంగాణ సర్కార్ కొరడా ఝులిపించింది. నిబంధనలు పాటించని కాలేజీలకు నోటీసులు జారీ చేసింది. ఫ్యాకల్టీ లేని కాలేజీలకు ఫెనాల్టీ విధిస్తోంది. రాష్ట్రంలో 150 కాలేజీలపై చర్యలకు ప్రభుత్వం సిద్దమైంది. హాజరుకాని ఫ్యాకల్టీల నుండి జీతాలు రికవరీ చేసి బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ ఖాతాలో జమ చేయాలని ఆదేశించింది. ఒక్కో కాలేజ్ కి లక్షల్లో జమ చేయాలని నోటీసులు జారీ చేసింది. వెంటనే స్పందించకపోతే 2019-20 విద్యా సంవత్సరానికి అనుబంధ గుర్తింపు ఇవ్వమని ఎస్బీ టెట్ వెల్లడించింది. ప్రభుత్వ నిర్ణయంతో పాలిటెక్నిక్‌ కళాశాలల యజమాన్యాలు అప్రమత్తమయ్యాయి. సాంకేతిక విద్యా కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ని కలిసి నిబంధనల్లో సడలింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top