'ముందు అసెంబ్లీని సమావేశ పరచండి' | Telangana congress leaders takes on TRS Government | Sakshi
Sakshi News home page

'ముందు అసెంబ్లీని సమావేశ పరచండి'

Oct 16 2014 1:57 PM | Updated on Aug 11 2018 7:11 PM

బడ్జెట్ సమావేశాలు ఇష్టమొచ్చినప్పుడు పెట్టుకోండి... కానీ రైతుల సమస్యలపై చర్చించేందుకు వెంటనే అసెంబ్లీని సమావేశపరచాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

హైదరాబాద్: బడ్జెట్ సమావేశాలు ఇష్టమొచ్చినప్పుడు పెట్టుకోండి... కానీ రైతుల సమస్యలపై చర్చించేందుకు వెంటనే అసెంబ్లీని సమావేశపరచాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కనీసం మూడు, నాలుగు రోజులు అసెంబ్లీ సమావేశ పరచాలని ప్రభుత్వానికి సూచించారు. 

గురువారం హైదరాబాద్లో శాసనసభలో ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి, శాసనమండలిలో కాంగ్రెస్ పార్టీ ఉపనేత షబ్బీర్ అలీ విలేకర్లతో మాట్లాడుతూ... కరెంట్ కోతలు, పంటలు ఎండిపోవడం వంటి రైతాంగ సమస్యలపై టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటివరకు 240 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని జానారెడ్డి, షబ్బీర్ అలీ గుర్తు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement