టీ కాంగ్రెస్లో 'స్థానిక' పదవుల లొల్లి | telangana congress leaders fight for local body posts | Sakshi
Sakshi News home page

టీ కాంగ్రెస్లో 'స్థానిక' పదవుల లొల్లి

Jun 30 2014 4:01 PM | Updated on Mar 18 2019 7:55 PM

టీ కాంగ్రెస్లో 'స్థానిక' పదవుల లొల్లి - Sakshi

టీ కాంగ్రెస్లో 'స్థానిక' పదవుల లొల్లి

రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు ఎమ్మెల్సీ యాదవ్రెడ్డి లేఖ రాశారు.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పదవుల లొల్లి అప్పుడే మొదలైపోయింది. రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు ఎమ్మెల్సీ యాదవ్రెడ్డి లేఖ రాశారు. జడ్పీ ఛైర్మన్ పదవి తనకు ఇస్తామని ముందునుంచి హామీ ఇవ్వడం వల్లే తాను జడ్పీటీసీ సభ్యునిగా పోటీ చేసి గెలిచానని చెప్పారు.

తీరా ఇప్పుడు తనకు కాకుండా మరో అభ్యర్థికి అక్కడి జడ్పీ ఛైర్మన్ పదవిని కట్టబెట్టాలని చూడటం సరికాదని ఆయన మండిపడ్డారు. దీనిపై వెంటనే జోక్యం చేసుకుని తనకు తగిన న్యాయం చయాలని యాదవ్రెడ్డి కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement