‘ఆశ్రమ’ టీచర్ల బదిలీ షెడ్యూల్‌ విడుదల | Teachers transfer schedule release | Sakshi
Sakshi News home page

‘ఆశ్రమ’ టీచర్ల బదిలీ షెడ్యూల్‌ విడుదల

Jun 9 2018 12:32 AM | Updated on Jun 9 2018 12:32 AM

సాక్షి, హైదరాబాద్‌: గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్ల బదిలీలకు షెడ్యూల్‌ విడుదలైంది. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌ క్రిస్టినా జెడ్‌ చోంగ్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల ఉపాధ్యాయులకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను ఈ టీచర్లకూ వర్తింపజేశారు.

బదిలీలకు సంబంధించి ఏర్పాట్లను పక్కాగా నిర్వహించాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆశ్రమ పాఠశాలల్లోని టీచర్ల బదిలీలు సైతం ఆన్‌లైన్‌   పద్ధతిలో వెబ్‌కౌన్సెలింగ్‌ ద్వారా చేపట్టనుంది.  

బదిలీలకు సంబంధించి వెబ్‌ కౌన్సిలింగ్‌లో వస్తున్న సందేహాలను నివృ త్తి చేయాలని టీఎస్‌పీఆర్టీయూ  పే ర్కొంది. ట్రాన్స్‌ఫర్‌ షెడ్యూల్‌లో అప్లికేషన్‌కు జూన్‌ 12 వరకు అవకాశం ఇవ్వాలని కోరింది. ఆన్‌లైన్‌లో  అనేక సమస్యలు ఎదురవుతున్నాయని, వాటిని సరి చేసి బదిలీ దరఖాస్తుల్లో ఎడిట్‌ ఆప్షన్‌ ఇవ్వాలని కోరింది.   

Advertisement
 
Advertisement
Advertisement