బదిలీ బాధలు | Teachers Transfer Process Technical Problems In Medak | Sakshi
Sakshi News home page

బదిలీ బాధలు

Jun 24 2018 12:29 PM | Updated on Oct 16 2018 3:15 PM

Teachers Transfer Process Technical Problems In Medak - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి : తొలిసారిగా ‘వెబ్‌ కౌన్సెలింగ్‌’ విధానంలో నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియకు సాంకేతిక సమస్యలు అవరోధంగా నిలుస్తున్నాయి. పూర్వపు మెదక్‌ జిల్లాలో 8,269 మంది ఉపాధ్యాయులు బదిలీ కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో గెజెటెడ్‌ ప్రధానోపాధ్యాయులు, ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎంలు తాము బదిలీ అయ్యే చోటు కోసం వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకునేందుకు శనివారం ఒక్క రోజే గడువు ఇచ్చారు. 262 మంది పీజీహెచ్‌ఎంలు, 152 మంది ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎంలు శని వారం ఆన్‌లైన్‌లో వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసేందుకు ఇబ్బందులు పడ్డారు. పాఠశాల యూ డైస్‌ పాత కోడ్‌లు ఇవ్వడంతో తడబాటుకు గురయ్యారు.

మరోవైపు ఒకే పేరు ఉన్న గ్రామాల్లో ఉన్న పాఠశాలలను ఎంపిక చేసుకోవడంలోనూ ఇబ్బందులు పడ్డారు. ఉదాహరణకు చిట్కుల్‌ పేరిట పటాన్‌చెరు, కొల్చారం మండలాల్లో పాఠశాలలు ఉండగా, అప్షన్‌లో మండలం పేరు లేక ప్రధానోపాధ్యాయులు అయోమయానికి గురయ్యారు. స్పౌజ్‌ కేటగిరీకి సం బంధించి 50 కిలోమీటర్ల పరిధిలోని పాఠశాలల్లోని ఖాళీలను చూపాల్సి ఉం డగా, 15 కిలోమీటర్ల పరిధిలోని స్కూళ్లను మాత్రమే వెబ్‌ ఆప్షన్‌లో చూపిం చారు. వెబ్‌ ఆప్షన్‌ నమోదులో ఎదురవుతున్న ఇబ్బందులను విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వెబ్‌ఆప్షన్ల నమోదు గడువును శనివారం అర్ధరాత్రి 12 గంటల వరకు పొడిగించారు. 

‘వెబ్‌ కౌన్సెలింగ్‌’పై నేడు నిరసన
ఉపాధ్యాయ బదిలీల కోసం విద్యా శాఖ ప్రవేశ పెట్టిన వెబ్‌ కౌన్సెలింగ్‌ విధానం పూర్తిగా లోపభూయిష్టంగా ఉందని ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక ప్రకటించింది. వెబ్‌ కౌన్సెలింగ్‌ విధానంపై ముందస్తు ఆవగాహన కల్పించక పోవడాన్ని ఉపాధ్యాయ సంఘాలు ప్రశ్నిం చాయి. కేవలం వందల సంఖ్యలో ఉన్న ప్రధానోపాధ్యాయులు వెబ్‌ ఆప్షన్ల నమోదులో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నాయి. ఆదివారం నుంచి వేలాది మంది స్కూల్‌ అసిస్టెంట్లు, ఎస్జీటీలు ఎదుర్కొనే సమస్యలకు ఎవరు బా ధ్యత వహిస్తారని ఐక్య వేదిక ప్రశ్నిం చింది.

వెబ్‌ కౌన్సెలింగ్‌ స్థానంలో పాత పద్ధతిలో బదిలీలు నిర్వహించాలనే డిమాండ్‌తో ఆదివారం జిల్లా కేంద్రం సంగారెడ్డిలో ర్యాలీ నిర్వహిస్తున్నట్లు 12 ఉపాధ్యాయ సంఘాలతో కూడిన ఐక్య వేదిక నాయ కులు ప్రకటించారు. స్థానిక ఐబీ అతిథిగృహం నుంచి ర్యాలీ ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనపై ఎస్టీయూ, టీపీఆర్టీయూ, టీఆర్‌టీఎఫ్, టీపీటీఎఫ్, టీటీఎఫ్, ఎస్జీటీఎఫ్, టీఎస్‌టీఎఫ్, టీఎస్‌ జీహెచ్‌ఎం, పీఆర్‌టీయూ నేతలు సంతకాలు చేశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement