2019 ఎన్నికలలో తెలంగాణలో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు
నకిరేకల్ : 2019 ఎన్నికలలో తెలంగాణలో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. నకిరేకల్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత టీఆర్‌ఎస్ పాలనను ప్రజలు నమ్మేపరిస్థితిలో లేరన్నారు. అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుందని పేర్కొన్నారు. మాదిగ, మాలలు కోటిమందిపైనే ఉండగా తెలంగాణ మంత్రి వర్గంలో ఒక్కరికి కూడా ప్రాధాన్యత కల్పించలేదని ఆరోపించారు. మహిళలకు కూడా కాబినేట్‌లో అవకాశం లేకపోవడం విచారకరం అన్నారు. త్వరలోనే టీఆర్‌ఎస్ పాలనపై ప్రజలు తిరగబడాల్సిన సమయం దెగ్గరలో ఉందన్నారు. ఈ సమావేశంలో నర్సిరెడ్డి, బీజేపీ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు వీరవెల్లి చంద్రశేఖర్, బిల్యానాయక్, నాయకులు దైద సుధాకర్, పల్‌రెడ్డి మహేందర్‌రెడ్డి, వెంకన్నగౌడ్, యాదయ్య ఉన్నారు.